ఏకదంతం మహాకాయం…
తప్తకాంచనసన్నిభమ్….
లంబోదరం విశాలాక్షం..
వందేహం గణనాయకమ్….


Vinayaka Chaviti

వినాయకచవితి


ప్రధానాంశాలు:

హిందువుల తొలి పండుగ వినాయక చవితి.

ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ గణేశుడికే.

నీలాపనిందలు పోగొట్టే వినాయక వ్రతకథ.

వినాయకుడి పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితి‘ రోజునే వినాయక చవితి‘ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టిఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించిదీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.

వినాయక చవితికి అంతా సిద్ధమా! అమెజాన్‌లో వినాయక విగ్రహ ప్రతిమలుపూజా సామగ్రిడెకరేషన్ ఐటమ్స్‌పై తగ్గింపు ధరలు

 

శ్లోకం: ‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.

 

పీటపై వినాయక ప్రతిమను ఉంచిపాలవెల్లికి పసుపు రాసికుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులుపళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లుకుడుములుపాయసంగారెలుపులిహోరమోదకులుజిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసిఅందులో నీళ్లువేసిపైన టెంకాయజాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

 

పూజకు కావాల్సిన సామాగ్రి

పసుపుకుంకుమగంధంఅగరవత్తులుకర్పూరంతమలపాకులుపూలుఅరటిపండ్లుకొబ్బరికాయలుబెల్లంతోరంకుందులునెయ్యినూనెవత్తలు, 21 రకాల పత్రిఉద్దరిణనైవేద్యాలు.

 

పూజా విధానం..

 Vinayaka Pooja

ఓం కేశవాయ స్వాహాఃఓం నారాయణాయ స్వాహాఃఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి.

 

గోవిందాయ నమఃవిష్ణవే నమఃమధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమఃవామనాయ నమఃశ్రీధరాయ నమఃహృషీకేశాయ నమఃపద్మనాభాయ నమఃదామోదరాయ నమఃసంకర్షణాయ నమఃవాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమఃఅనిరుద్దాయ నమఃపురుషోత్తమాయ నమఃఅధోక్షజాయ నమఃనారసింహాయ నమఃఅచ్యుతాయ నమఃఉపేంద్రాయ నమఃహరయే నమఃశ్రీ కృష్ణాయ నమఃశ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

 

ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి.

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమఃఓం ఉమామహేశ్వరాభ్యాం నమఃఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమఃఓం శచీపురందరాభ్యాం నమఃఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమఃఓం శ్రీ సితారామాభ్యాం నమఃనమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు

 

భూతోచ్చాటన

ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకొవాలి.

 

ప్రాణాయామం: ఓం భూఃఓం భువఃఓగ్ సువఃఓం మహాఃఓం జనఃఓం తపఃఓగ్ సత్యంఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్|, |ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్

 

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి.



 Vinayaka Story

సంకల్పం:

 

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తేశ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధేశ్వేతవరాహకల్పేవైవస్వత మన్వంతరేకలియుగేప్రథమపాదేజంబూ ద్వీపేభరతవర్షేభరతఖండేమేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన శ్రీ…ప్లవ………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ……భృగు వాసరేశుభ నక్షత్రేశుభయోగే శుభకరణేఏవంగుణ విశేషేణ విశిష్టాయాంశుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధంధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధంపుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధంశ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి.

 

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

 

షోడశోపచార పూజ

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభంచతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం.

 

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి:

 

 

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం. ఆసనం సమర్పయామి:

 

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం. ఆర్ఘ్యం సమర్పయామి:

 

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన. పాద్యం సమర్పయామి:

 

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవతుభ్యం దత్తంమయా ప్రభో. ఆచమనీయం సమర్పయామి:

 

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే. మధుపర్కం సమర్పయామి:

 

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. పంచామృత స్నానం సమర్పయామి:

 

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే.శుద్దోదక స్నానం సమర్పయామి:

 

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. వస్త్రయుగ్మం సమర్పయామి:

రాజితం బహ్మసూత్రంచ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక. ఉపవీతం సమర్పయామి:

 

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం. గంధాన్ సమర్పయామి:

 

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. అక్షతాన్ సమర్పయామి:

 

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.


Vinayaka Mantram 

పుష్పాణి పూజయామి: అథాంగ పూజ పుష్పాలతో పూజించాలి.

 

గణేశాయ నమః – పాదౌ పూజయామి

ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి



శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి

విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి



అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి

హేరంబాయ నమః – కటిం పూజయామి



లంబోదరాయ నమః – ఉదరం పూజయామి

గణనాథాయ నమః – నాభిం పూజయామి



గణేశాయ నమః – హృదయం పూజయామి

స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి



గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి

విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి



శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి

ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి



సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి

విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి



ఏకవింశతి పత్రపూజ



Vinayaka Praja Pooja

ఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి.

 

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి।

గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।

ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి।

 

గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి।

లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి।

గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి।

గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,

వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి।

భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,

వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,

సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,

ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,

హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,

ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,

వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,

సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి।

కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.


 Vinayaka Astotram

అష్టోత్తర శత నామ పూజా

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

 

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

 

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

 

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశేనమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

 

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

 

దశాంగం గుగ్గలోపేతం సుగంధంసుమనోహరంఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ.. ధూపమాఘ్రాపయామి

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయాగృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే.. దీపందర్శయామి।

 

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.. నైవేద్యం సమర్పయామి.

 

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచభూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక.. సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతంకర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం.. తాంబూలం సమర్పయామి.

 

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ.. నీరాజనం సమర్పయామి.

 

అథ దూర్వాయుగ్మ పూజా.. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

 

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి.

 

నమస్కారముప్రార్థన

 

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన.. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన.. పునరర్ఘ్యం సమర్పయామి,

 

ఓం బ్రహ్మవినాయకాయ నమః 

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశనఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్.


వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ.. నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.


Vinayaka Dandakam

వినాయక దండకం

పార్వతీ పుత్రాలోకత్రయీస్త్రోత్రసత్సుణ్య చరిత్రసర్వార్థసంపత్ప్రదా! ప్రత్యబ్దసంపూజితా! నిన్ను విద్యాలయంబందు విద్యార్థిసంఘంబులౌ మేము సద్భక్తితో స్థాపనం జేసియున్నార మీవేళ నీవద్ద బద్ధాంజలీయుక్తమౌ ముద్రలందాల్చి సప్తాహపర్యంత మాపైన రెన్నాళ్లు నిత్యంబు వేళాద్వయంబందు శ్రద్ధాఢ్యతంబూని పూజించగా నిల్చియున్నార మోదేవ! మున్ముందుగా నాచతుర్థిన్ సుకల్పోక్తరీతిన్ విశేషంబులైనట్టి పత్రాదిసామగ్రినిం దెచ్చిటెంకాయలున్ పుష్పముల్మాలలున్ధూపముల్దీపముల్ గూర్చిసత్పూజలం జేసియుండ్రాళ్ళువడ్పప్పుబెల్లంబుపండ్లప్పముల్గారెలున్బూరెలున్ దెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యముల్ చూపివిఘ్నేశ్వరోత్పత్తియు న్నాశ్యమంతాఖ్యమై యొప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో నేకచిత్తంబునుంబూని చెప్పించుకొన్నాముమంత్రోక్తరీతిన్ సుపుష్పంబు లందించియున్నాముఛత్రాదులున్చామరంబుల్సుగీతంబులున్నీకెయర్పించియున్నార మోదేవ! యీదీక్షలో నిత్య మీరీతి సూర్యోదయంబందుసాయాహ్నకాలంబునన్ నిన్నె యర్చించుచున్నాముపూజావిధానంబుమంత్రంబులం నేర్వలేమైతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి యింతేనియున్ లేని యజ్ఞాన మందున్న మేమిచ్చటన్ జేయుచున్నట్టి పూజాదిసర్వోపచారంబులం స్వీకరించంగ నిన్వేడుచున్నాముమాపైని కారుణ్యముంజూపుమాయజ్ఞానమున్ ద్రుంచుమాదోషముల్ సైచిసద్విద్యలందించుమాధాత్రిలో మాకు సద్బుద్ధివిజ్ఞానసంపత్తిసత్కీర్తియారోగ్యభాగ్యంబుసత్త్వంబుసన్మార్గసంచారధైర్యంబుసత్పాత్రతాదీప్తితోడన్ జయం బెల్లకాలంబులం గూర్చిసత్పౌరులం జేయుమాదేశభక్తిన్ సదానిల్పి విద్యాభివృద్ధిన్ ప్రసాదించి మమ్మున్ వివేకాఢ్యులం జేయుమాదేవదేవా! మహాకాయ! లంబోదరా! ఏకదంతా! గజాస్యా! సదావిఘ్ననాశా!మహేశాత్మజాతా! ప్రభూ! నాగయజ్ఞోపవీతా! భవానీతనూజా!త్రిలోకైకనాథా! సదామందహాసా! సురేంద్రా! గజేంద్రాననా! శూర్పకర్ణా! నమస్తే నమస్తే నమస్తే నమః

 

 

 Vinayaka Story

వినాయక వ్రత కథ

 

వినాయక వ్రత కథ చదివేవారుపూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.

 

దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు….ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవిజరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు…గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లుకుడుములుపిండివంటలుపండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

 

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లుకుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

 

 

ఋషి పత్నులకు నీలాపనిందలు

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూఅగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరకశపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులువారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండిసుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

 

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

 

 

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసిదానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

 

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు.

భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికిఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలుమహర్షులుమనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గానివిని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసిసాష్టాంగ నమస్కారాలు చేయాలి.

 

 

కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి… అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.

 Vinayaka Udvasana Mantram

ఉద్వాసన మంత్రం

యఙ్ఙ‌ేన యఙ్ఙ‌మయజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్తేహనాకంమహిమానస్సచంతే యాత్ర పూర్వేసాధ్యాస్సంతిదేవా!!

సర్వేజనా సుఖినో భవంతు

Neeradi

Share
Published by
Neeradi

Recent Posts

Telugu Love Quotes in English

మనుసులో ఉన్నా భావాలను & ప్రేమ అభిమానాలను సరళమైన పదాలతో తెలియపరుచుతూ కొన్ని Telugu Love Quotes ఇక్కడ ఉన్నాయి,…

3 months ago

Happy Ugadi 2024 Wishes Status & images in Telugu

Happy Ugadi 2024 మన రెండు తెలుగు రాష్ట్రం లో  చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాదిని జరుపుకుంటారు  ఈ సంవత్సరం…

3 months ago

Best 100+ Happy Christmas Wishes HD Images 2024

Happy Christmas is when Christians celebrate the birth of Jesus Christ. Christians all over the…

2 years ago

200 Best Good Morning Quotes

Everyone wants every day of their life to continue happily, and every Good Morning to…

2 years ago

Lord Shiva Top 10 Heart-Touching Quotes About Shiva Story

మూడో కన్నును తెరవరా ముక్కంటీ ఈశ్వరా మునిజనుల రక్షించరా ముక్కంటీ పరమేశ్వరా ముష్కరుల తుదముట్టించరా మూషికుని ప్రియహరా దివిని భువిని…

2 years ago

Happy Children’s Day 50 Best Quotes Hd wishes Images Greetings

Happy children's day  Children's Day 2022: Quotes Children’s day is not only for children, this…

2 years ago