Telugu Love Quotes Motivational Quotes

Share Your Friends :)

 

Telugu Love Quotes Motivational Quotes
Telugu Love Quotes Motivational Quotes

 Telugu Love Quotes

ఏ వస్తువైనా.. బంధమైనా రెండుసార్లు మాత్రమే…

 అందంగా కనిపిస్తుంది ఒకటి దొరికినప్పుడు.. 

రెండోది పోగొట్టుకున్నప్పుడు… 

ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు…

 లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు…….!!


Ye vastuvaina .. bandamaina rendusarlu matrame

anandamgaa kanipistundi okati dorikinappudu.. 

rendavadi pogottukunnappaudu

endukante unnappudu dhani viluva teliyadu

lenappudu entha aaratapadda dhorakadu..

Telugu Love Quotes Motivational Quotes

 Telugu Love Quotes



కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది,

హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది,

మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.



ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం

ఆపినపుడు నీవు నీ అసలైన

జీవితపు ఆనందాన్ని పొందుతావు.


నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు

దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే

నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.


మనం జరిగిపోయిన దాన్ని

వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు

కానీ జరగబోయేదాన్ని

కచ్చితంగా మార్చవచ్చు.


నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని

చూసి చీకటి భయపడుతుంది.

అలాగే నిరంతరం కష్టపడేవాడిని

చూసి ఓటమి భయపడుతుంది.


పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు.

బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.


ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి

ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు.

అలాగే నడత చెడిందంటే ఎలాంటి

పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.


ప్రతి అడుగును లక్ష్యంగా

మార్చటం వల్ల ప్రతీ లక్షాన్ని

అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.


జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో,

వారి వల్లే ఎక్కువ బాధపడతావు.



అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు

ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి.

లేదా ఆ కాంతిని ప్రతిబింబించ

గలిగే అద్దంగా అయినా మారాలి.


అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది.

విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి.


పదిమంది మనం చేసే ప్రతీ

పనిని ప్రశంసించాలని ఆరాటపడటం

వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.


అందరిలో మంచి చూడడం

నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో

నీ అంత బలమైనవాడు వేరొకరు లేరు.


మన ఆత్మీయులతో పంచుకుంటే

సంతోహం రెట్టింపవుతుంది.

అలాగే విషాదం సగం అవుతుంది.


నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే ఎవరో

ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.


ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు.

దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి.

కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు.

దాని గురించి పని చేయడం తెలియాలి.

ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి

కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు.

ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి

కానీ మీ వల్ల ఏడవకూడదు.



తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి..

ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు.

తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు.



జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే..

మరో తలుపు తెరుచుకుంటుంది.

కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ..

మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం



ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత..

నువ్వు చేసిన పనుల గురించి కాకుండా..

చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు.

అందుకే నచ్చినవన్నీ చేసేయాలి.





Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *