Happy Sunday Motivational Happy Sunday best quotes

Share Your Friends :)

 

Happy Sunday Motivational Happy Sunday  best quotes

అందరూ బాగుండాలి

అందులో మనముండాలి

హ్యాపీ సండే 

Andharu baagundali

andhulo manamundali

happy sunda…

Happy Sunday Motivational Happy Sunday  best quotes

  Telugu Motivational  quotes  

జీవితంలోని కొన్ని క్షణాలు 
జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, 
మనతో ఉన్నపుడే వాటి విలువను గుర్తించాలి.


విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు, 
తన విశ్వాసాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.

నీ కలలు నిజం కావాలంటే 
నీకు ముందుగా కలలు సాధించే ఆశయాలు ఉండాలి.

చేసే సంతకం కుడా 
ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. 
కొన్నిసార్లు పేరును కూడా.. 

నీ బాధ్యతను నీవు గ్రహించినపుడు, 
నీ ఆశయాలను కూడా పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది.

తన ఆశయాలకొరకు పనిచేయక 
సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం.

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు 
నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం.

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. 
హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. 
మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

జీవితం చాలా కష్టమైన పరీక్ష. 
దీనిలో చాలా మంది విఫలం కావటానికి కారణం, 
ప్రతీఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించక పోవటమే.

నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా
 పోగొట్టుకున్న దానిని గురించి ఏడవటం మూర్ఖత్వం.

ఎక్కువగా నమ్మటం, 
ఎక్కువగా ప్రేమించటం, 
ఎక్కువగా ఆశించటం 
ఫలితంగా వచ్చే బాధ కూడా 
ఎక్కువగానే ఉంటుంది.

జీవితాన్ని మొత్తంగా ఆస్వాదించడానికి ప్రయత్నించండి 
ఎందుకంటే అది మళ్లీ తిరిగి రాదు.

నీవు ప్రతీ రోజు 
ఒకరికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. 
అది ఎవరోకాదు, నిన్నటి నువ్వే.

జరిగిపోయిన దానిని గురించి చింతించకు. 
మనకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే 
జరిగే చెడు అనుభవాన్ని ఇస్తుంది.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోనపుడు 
నీ అసలైన విజయపు ఆనందాన్ని నీవు పొందుతావు.

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో 
కష్టాన్ని చుస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

మన జీవితాన్ని ఆస్వాదించడానికి 
మనకు ముఖ్యంగా కావలసింది 
మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.

ఆలస్యం అవుతుందని 
చేపట్టిన పనులను ఆపవద్దు, 
ఎందుకంటే గొప్ప కార్యాలు సమయాన్ని ఆశిస్తాయి.

నేను ఇతరులను క్షమిస్తాను, 
దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు. 
నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.

అర్థరహితమైన మాటలకన్నా 
అర్థవంతమైన నిశ్శబ్దం చాలా మంచిది.   
Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *