Bhagavad Gita Quotes Bhagavad gita telugu Quotes

Share Your Friends :)
Bhagavad Gita Quotes Bhagavad gita telugu Quotes

Bhagavad Gita Telugu Quotes

(ప్రపంచమున) ఎవడును ఒక్క   క్షణకాలమైనను కర్మము చేయక ఉండనేరడు. ప్రకృతివలన బుట్టిన గుణములచే ప్రతివాడును బలత్కారముగ  కర్మములను చేయుచునేయున్నాడు. –భగవద్గీత

 

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ।। 22 ।।
 
ఎవరైతే అనన్య భక్తితో నన్నే సేవిస్తుంటారో, నిరంతరం చింతన చేస్తూ ఉంటారో, అటువంటి వారి యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను… 


అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే   అవుతుంది!!! ” పని చేయకుండా ఎవరూ ఫలితాన్ని పొందలేరు!! భగవద్గీత!!
 
 
అహింసా పరమో ధర్మః  మనందరికీ గాంధీ పాపమా అని ఈ ఒక్క ముక్కా నానార్ధాలతో సహామహా బాగా తెలుసు. పనిలోపనిగా బుద్ధుడుకి కూడా అన్వయించేసి చాతగానీ ఎర్రిపప్పల్లాగా చేతులు ముడుచుకు కూర్చోడం కూడా మహా బాగా తెలుసు. తెలియందల్లా ఇది సగం ముక్క మాత్రమే అన్న విషయం.
 
మహాభారతంలో ఈ తరువాయి ముక్కతో పూర్తి శ్లోకం ఇదీ. అహింస అన్ని ధర్మాల్లో కెల్లా పరమోత్తమమైనది. ధర్మోద్దరణకి హింస అనునది అంతే పరమోత్తమం.
 
 
ఇదీ పూర్తి శ్లోకం దాని అసలు అర్ధం. ఆయుధం లేని దేవుడు ఉన్నాడా ఆయుధం లేని దేవత ఉందా.
 
మన సనాతన ధర్మంలో మొదటి పంక్తి సన్యసించిన వైరాగ్య మార్గంలోని సాధు సంతులకు మాత్రమే. ఒక సాధువును పురికొల్పి హింసించినా తనని తాను రక్షించుకోవడానికి కూడా, తనకు ప్రాణహాని కలిగినా ఆయుధం చేత బట్టడు. కేవలం సకల చరాచర సృష్టిలో తనని తాను చూసుకుంటూ అవతలి జీవిలో కూడా పరమాత్మని దర్శించే మహోన్నత భావవ్యక్తీకరణ వల్ల.
 
కానీ ధర్మం అహింస పేరిట చాతగానీ దద్దమ్మల తయారీ యంత్రామ్గంలో ఈ రెండవ పంక్తిని నిర్లజ్జగా బోధించటం మానివేశారు.
సనాతంధర్మంలో హింస అనేది క్షాత్ర ధర్మం. దానిని అనుసరించి (సమాజ ధర్మ రక్షణ బాధ్యత వహించి రక్షించే వర్గం) సంఘాన్ని రాక్షసుల బారినుంచి, దోపిడీ ముఠాల నుంచి, క్రూర మృగాల నుంచి, అదే నేటి కాలంలో అనేకుల నుంచి రక్షించే ఆయా వ్యక్తుల, అధికారుల నైతిక బాధ్యత.
 
దుష్ట శిక్షణకై ఆయుధం పట్టని దేవుడు, దేవత ఉన్నారా ?
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు కూడా అంకుశం ధరించి శిష్టరక్షణ చేస్తారే
దుష్టత్వం రూపుమాపడానికి ప్రతి మనిషి ఒక రక్షకుడు అవ్వాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.
 
సర్జికల్ స్ట్రైక్స్, సరిహద్దుల్లో కాపలా, పోలీసు పోలింగ్ అధికారుల రక్షణకై జీపుకి తీవ్రవాదిని కట్టడం, నక్సల్ మావో దోపిడీ దొంగలని మట్టుబెట్టడం, నయీం, ఒసామా లాంటి చీడ పురుగులను ఏరివేయడం లాంటివి. ఇది పేరుకు హింస అయినా సమాజ రక్షణకు అత్యంత అవసరం.
 
తిరిగి మరోసారి చదువుకుందాం.
అహింస అన్ని ధర్మాల్లో కెల్లా పరమోత్తమమైనది.
ధర్మోద్దరణకి హింస అనునది అంతే పరమోత్తమం.
 
ఎప్పుడూ సగం ముక్క ఎవరైనా చెబితే రెండో ముక్క కూడా చెప్పి ఇంతకాలం చేసిన తప్పులు సరిదిద్దుకుందాం.
 
ధర్మో రక్షతి రక్షితః 
Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *